Learn Options Basics and Strategies
ప్రొఫెషనల్ ఆప్షన్ ట్రేడర్‌గా మారితే నెలవారీ ఆదాయాన్ని, వీక్లీ ఆదాయాన్ని జనరేట్ చేయొచ్చు. అయితే ఇందులో లక్షలకు లక్షలు వస్తాయని ఎవరు చెప్పినా తప్పే. మనం పటిష్టమైన స్ట్రాటజీలను బిల్డ్ చేసుకోగలిగితే మాత్రం మంచి లాభాలను ఇందులో చూడొచ్చు. మార్కెట్ ఎటుపోయినా మనకు తక్కువ రిస్క్ ఉండేలా, అధిక ప్రాఫిట్ సాధించేలా మనం ప్లాన్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య ఎలాంటి ముందుస్తు అవగాహన లేకుండా కేవలం నేక్డ్ ఆప్షన్స్ తీసుకుని చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ప్రైసింగ్ ఫార్ములా గురించి సరిగ్గా తెలుసుకోకపోవడం, బేసిక్ కాన్సెప్ట్ పై పటిష్టమైన ఫౌండేషన్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మనం ప్రొఫెషనల్ ట్రేడర్ గా మారాలంటే మాత్రం.. ప్రొఫెషనల్స్ నుంచి నేర్చుకుంటేనే సులువవుతుంది.
అయితే ఒకప్పుడు కేవలం హెడ్జింగ్ కోసం మాత్రమే ఉపయోగించే ఈ డెరివేటివ్స్ ఇప్పుడు పూర్తిగా మెయిన్ ట్రేడింగ్ ఆప్షన్ అయ్యాయి. మార్కెట్లో అప్పుడప్పుడే వచ్చిన వాళ్లు కూడా ఇప్పుడు నేరుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్, ఆప్షన్స్ వైపు దిగిపోతున్నారు. రూ.20-30 వేల అతి తక్కువ పెట్టుబడితో కూడా ఆప్షన్స్ ట్రేడింగ్‌లోకి దిగుతున్నారు. ఒక రకంగా ఇది మంచిదే అయినా. అవగాహన లేకుండా మాత్రం ఆప్షన్స్ తీసుకుంటే డబ్బులు అత్యధికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడున్న హై ఓలటాలిటీ సెషన్లలో మార్కెట్ డైరెక్షన్స్ చాలా వైల్డ్‌గా ఉన్నాయి. అలాంటప్పుడు మనం రాంగ్ సైడ్ ఉంటే డబ్బులు హారతి కర్పూరంలా కరిగిపోతాయ్. ఒక వేళ మార్కెట్ మనం అనుకున్నట్టు పెరిగినా మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఎక్కడో దూరంగా ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. లిమిటెడ్ క్యాపిటల్ రిస్క్ అనే ఉద్దేశంతో ఆప్షన్స్ సెగ్మెంట్లోకి దిగుతాం కానీ... అలా పెడుతూ పోతూ ఉంటే.. ఊబిలా మనం నష్టాల్లో కూరుకుపోతూ ఉంటాం. సక్సెస్‌ఫుల్ ట్రేడ్స్ వస్తూ మనం అనుకున్నట్టు సాగితే వెల్ అండ్ గుడ్. అలా కాకుండా అత్యధిక సార్లు నష్టాల ట్రేడ్స్ వస్తున్నాయంటే దానికి కారణం మనం సరైన హోం వర్క్, గ్రౌండ్ వర్క్ చేయడం లేదు అనేదే అర్థం.
ఒక కాల్ ఆప్షన్ అయినా.. పుట్ ఆప్షన్ అయినా తీసుకునే ముందు ఎందుకు తీసుకుంటున్నామో అవగాహన ఉందా ? కేవలం మన ఊహాశక్తి, అంచనా మాత్రమే వేస్తున్నామా ? మ్యాథమ్యాటికల్ కాల్యుకులేషన్స్, టెక్నికల్ ఎనాలిసిస్ ఇందులో ఏమీ పనిచేయవా ? అనేది ఆలోచించాలి. ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పుడు అందులో రిస్క్ - రివార్డ్ ఎంతో ఎప్పుడైనా లెక్కించుకున్నామా ?
వీక్లీ బ్యాంక్ నిఫ్టీ మరింత టెంప్టింగ్‌గా ఉంటుంది కాబట్టి ఎంటర్ అయి మీలో ఎంత మంది వేలకు వేలు పోగొట్టుకున్నారు ? వీక్లీ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఎక్స్‌పైరీ రోజున మధ్యాహ్నం తర్వాత మార్కెట్లో లాటరీల కోసం ఎంటర్ అయి ఎంత మంది డబ్బులు కుమ్మరించి పోగొట్టుకున్నారు ?
పైన చెప్పిన అనేక ప్రశ్నల్లో మీరు అవగాహన లేకుండా డబ్బులు పోగొట్టుకున్నారంటే.. దాని అర్థం మనకు సబ్జెక్ట్‌పైనో, లేక మన ఎమోషన్స్‌పైనో కంట్రోల్ లేదని తెలుసుకోవాలి. అందుకే సబ్జెక్ట్ పై మనం పట్టు సాధిస్తే.. ఇక నుంచి చేసే ట్రేడ్స్ అయినా కాస్త జాగ్రత్తగా చేసుకోవచ్చు. వేలకు వేలు డబ్బులు సంపాదించడం కంటే.. కనీసం పోగొట్టుకోకుండా అయినా ఉంటాం. ఈ క్లాసుల తర్వాత మీరు ఓ ప్రొఫెషనల్ ఆప్షన్ ట్రేడర్‌గా మారేందుకు ఓ మార్గం ఏర్పడుతుంది. ఈ క్లాసుల తర్వాత ప్రాక్టీసింగ్ మొదలుపెడితే ఖచ్చితంగా మీరు ఓ ప్రొఫెషనల్‌గా మారేందుకు అవకాశం ఉంటుంది.
Monthly Income Strategy, Weekly Income Strategy
మనం ఆప్షన్స్ ద్వారా కొద్దిమొత్తంలో అయినా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కొంత హెడ్జింగ్, కాల్ రైటింగ్ పై మన అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. రిస్క్ తగ్గించుకునేందుకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, నెలవారీగా కొంత స్థిరమైన డబ్బును ఎలా సంపాదించుకోవచ్చు అనే అంశాలను ఎనలిస్టులు మీకు నేర్పిస్తారు. హెడ్జింగ్ చేసుకుంటూ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా సరైన ప్రణాళిక, ఖచ్చితమైన ఎంట్రీ టైం, స్ట్రైక్ ప్రైస్ ఆధారంగా ఎలా ఎంట్రీ తీసుకోవాలో చూపిస్తారు. అయితే ఇందులో భారీగా లక్షలకు లక్షలు వస్తాయని చెప్పబోం. స్థిరమైన ఆదాయాన్ని ఓ ప్లాన్ ప్రకారం ఎలా తెచ్చుకోవాలో మీకు వివరిస్తారు.
ఈ స్ట్రాటజీలను సంవత్సరాల పాటు బ్యాక్ టెస్ట్ చేసిన అనుభవంతో మీకు ఎనలిస్టులు సాధికారికంగా ఈ అంశాలను వివరిస్తారు. ఈ క్లాసుల తర్వాత లైవ్ క్లాసుల్లో మీకు వాళ్ల ట్రేడ్ ప్లాన్‌ను లైవ్‌లో ఎంట్రీ తీసుకుని చూపిస్తారు. వీటిని మీరు పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత మీరు కూడా నెల వారీగా ఖచ్చితమైన టైంలో ఎంట్రీ తీసుకుని వీక్లీ, మంత్లీ ఇన్‌కం సంపాదించే అవకాశం ఉంది.
ఈ ఆన్ లైన్ క్లాసుల్లో ఏం తెలుసుకుంటాం ?
Options
కాల్, పుట్ అంటే ఏంటి అనే ప్రాధమిక అంశాల దగ్గరి నుంచి వీటిపై పూర్తి అవగాహన
ఆప్షన్స్ కొనుగోలులో లాభ, నష్టాలు
ఆప్షన్స్‌లో డైరెక్షనల్ ట్రేడింగ్
ఆప్షన్స్ రైటింగ్‌లో లాభ, నష్టాలు
ఆప్షన్ గ్రీక్స్
ఇంప్లైడ్ వోలటాలిటీ
వోలటాలిటీ అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి
బులిష్ స్ట్రాటజీస్, బేరిష్ స్ట్రాటజీస్
న్యూట్రల్ స్ట్రాటజీస్, ట్రేడ్ అడ్జస్ట్‌మెంట్స్
వీక్లీ ఇన్‌కం ఆప్షన్ స్ట్రాటజీ
మంత్లీ ఇన్‌కం ఆప్షన్ స్ట్రాటజీ
హెడ్జింగ్ స్ట్రాటజీస్
మొత్తం 4 క్లాసులు ( 2 Hours each Class ) and Two Live Market Classes
ఇవి రికార్డెడ్ వీడియో క్లాసులు. మీకు క్లాసులకు సంబంధించిన లింకును పంపించడం జరుగుతుంది. మొబైల్‌లో లేదా ల్యాప్ టాప్, డెస్క్ టాప్‌లో కూడా చూసుకోవచ్చు.
ఫీజ్ ఎంత ?
ఈ మొత్తం కోర్సుకు రూ.9వేలు
పేమెంట్ ఎలా ?
Google Pay : +91 9391002840 ( M Rajendra Prasad )
After payment whatsApp screenshot along with Name, Phone Number and e-mail id
**************